Namaste NRI

విజయవంతముగా ముగిసిన తానా మెగా ఐ క్యాంపు

కృష్ణా జిల్లా రేమల్లే గ్రామము నందు  తానా మరియు రోటరీ హాస్పిటల్ విజయవాడ వారు సంయుక్తముగా డిసెంబర్ నాలుగవ తేదీ తానా మెగా ఐ క్యాంపు  నిర్వహించడం జరిగినది  . సుమారు నాలుగువందల పైగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికీ కళ్ళ జోళ్ళు పంచడం జరిగినది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా హాజరైన తానా ఫాండషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ గారిని , కమ్యూనిటీస్ సర్వీస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి  గారిని రేమల్లే గ్రామస్తులు ఘనంగా  సత్కరించారు . ఈ మెగా ఐ క్యాంపు కార్యక్రమానికి తానా కమ్యూనిటీస్ సర్వీస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి గారు స్పాన్సర్ చెయ్యడం జరిగినది . కార్యక్రమానికి రేమల్లే గ్రామ వాస్తవ్యులు కలపాల సూర్యనారాయణ గారు , తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి  సమన్వయ కర్తలుగా వ్యవహరించారు

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events