తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీసీ చీఫ్ బిపిన్ రావత్ కూడా చనిపోయినట్టు ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా ధ్రువీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది. తొలుత 12 మంది చనిపోయారని, రావత్‌కు ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలిపినా, ఆయన హెల్త్ కండిషన్ సీరియస్‌గా ఉందని తెలిపారు అధికారులు. అయితే దాదాపు 80 శాతానికి పైగా తీవ్ర గాయాలు కావడంతో కాపాడలేకపోయినట్లు తెలిపారు డాక్టర్లు. ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడు కునూరు నీలగిరి కొండల్లో కుప్ప కూలింది. ఈ దుర్ఘటనలో సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ తో పాటు 12 మంది చనిపోయారు. కాగా డిఎన్ ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించారు. మరణించిన వారిలో బిపిన్ భార్య కూడా ఉన్నారు. ఈ ఘటనలో బిపిన్ ఒళ్లంతా పూర్తిగా కాలిపోయి ఉంది. హటాహుటిన బిపిన్ రావత్‌ను ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించినా అతడిని కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు.