Namaste NRI

విశ్వక్ సేన్ లైలా టీజ‌ర్ వ‌చ్చేసింది

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం లైలా.  రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం. ఈ చిత్రానికి సాహు గారపాటి నిర్మాత. ఈ సంద‌ర్భంగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేకర్స్. మనకు తెల్లగా చేసుడే కాదు. తోలు తీసుడు కూడా వచ్చు  అంటూ టీజ‌ర్‌తోనే ఫుల్ ఎంట‌ర్‌టైన‌మెంట్ ఉండ‌బోతుంద‌ని చెప్పాడు విశ్వ‌క్. ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌ బ్యూటీపార్లర్‌ నడిపించే మోడల్‌ సోనూగా, లైలా అనే అమ్మాయిగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. బ్యూటీ పార్లర్‌ లో మహిళలను ఆకర్షించే సోనూ పాత్రతో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మోడల్‌ సోనుతో మహిళలు చనువుగా ఉండటంతో మగాళ్లందరూ ఆయనపై అసూయ పెంచుకుంటారు. ఈ నేపథ్యంలో సోనూ అనూహ్యంగా అమ్మాయి లైలాగా అవతారాన్ని ఎత్తాల్సివస్తుంది. ఈ రెండు పాత్రల్లో విశ్వక్‌సేన్‌ చక్కటి వేరియేషన్‌ కనబరచినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతున్నది. రొమాన్స్‌, యాక్షన్‌, కామెడీ అంశాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుందని మేకర్స్‌ తెలిపారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: లియోన్‌ జేమ్స్‌, రచన: వాసుదేవ మూర్తి, దర్శకత్వం: రామ్‌ నారాయణ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events