Namaste NRI

వరంగల్ లో శ్యామ్ సింగ రాయ్ రాయల్ ఈవెంట్

నాని కథానాయకుడిగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం శ్యామ్‌ సింగరాయ్‌. ఈ సందర్భంగా ఈ సినిమా వేడుకని ఈ నెల 14న వరంగల్‌లో నిర్వహించనున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. రాయల్‌ ఈవెంట్‌ పేరుతో రంగలీల మైదానంలో శ్యామ్‌ సింగరాయ్‌ వేడుకని నిర్వహిస్తున్నామని, దీనికి నానితో పాటు, ఇతర చిత్రబృందం హాజరవుతుందని సినీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. రాహుల్‌ రవీంద్రన్‌, మురళీశర్మ, అభినవ్‌ గోమటం, జిషు గుప్తా, లీలా సామ్సన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: సాను జాన్‌ వర్గాస్‌, కథ: సత్యదేవ్‌ జంగా. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. రాహుల్‌ సెబాస్టియన్‌ కథానాయికలు. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. ఈ నెల 24న దక్షిణాది లోని అన్ని భాషల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events