వరుణ్‌సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా నటించిన చిత్రం ఇందువదన. కొంచెం విరామం తర్వాత వరుణ్ సందేశ్ నటించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కళాత్మకమైన కథతో రూపొందిన చిత్రమిది. వరుణ్ సందేశ్ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ ఇందులో నటించారు. సతీష్ ఆకేటి కథ, కథనం, మాటలు సమకూర్చారు. విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్, పాటలకి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. చిత్రం కూడా ఇంటిల్లిపాదికీ నచ్చేలా ఉంటుందన్నారు. రఘుబాబు, అలీ, నాగినీడు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శివ కాకాని. ఎం.శ్రీనివాసరాజు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ బాలాజీ పిక్చర్స్ పతాకంపై మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. జనవరి 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.