భారత్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మతసంస్థ తబ్లీఫీు జమాత్‌పై సౌదీ అరేబియా ప్రభుత్వం తాజాగా నిషేధం విధించింది. ఉగ్రవాదానికున్న ద్వారాల్లో ఈ సంస్థ కూడా ఒకటిని, దీని వల్ల సమాజానికి ప్రమాదమని తెలిపింది. ఈ సంస్థతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదంటూ ప్రజలను హెచ్చరించాలని అక్కడి మసీదులను ఆదేశించింది. ఈ సంస్థ చేసిన తప్పులను, సమాజానికున్న అపాయాన్ని శుక్రవారం మత ప్రార్థనల తరువాత ప్రజలకు వివరించాలని మసీదులకు సూచించింది. తబ్లీఫీు జమాత్ 1926లో భారత్‌లో ఏర్పాటైన విషయం తెలిసిందే. ముస్లిం మత సంప్రదాయాలను పాటించాలంటూ ప్రచారం చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ మేరకు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)