యూఏఈకి చెందిన రిటైల్ దిగ్గజం లులు గ్రూపు గుజరాత్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఏకంగా రూ.2వేల కోట్లతో మాడ్రన్ షాపింగ్ మాల్ తెరిచేందుకు రెడీ అవుతుంది. దీని ద్వారా సుమారు 5 వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు కీలక ప్రకటన చేశారు. గుజరాత్ మ్యుమంత్రి భూపేంద్ర పటేల్ దుబాయ్‌లో ఎన్నారై వ్యాపారవేత్త. లులు గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ యూసఫ్ అలీను కలిసిన తర్వాత ఈ ప్రకటన వెలువడిరది.
2022 జనవరిలో జరగనున్న వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌పై ప్రచారంలో భాగంగా ప్రస్తుతం సీఎం నాయకత్వంలో గుజరాత్ ప్రతినిధుల బృందంలో ఈఏఈలో పర్యటిస్తుంది. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించి రాష్ట్ర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు గట్టి పునాది వేయాలని గుజరాత్ భావిస్తోంది. దీనిలో భాగంగానే తాజాగా లులు గ్రూపుతో ఈ భారీ ఒప్పందం కుదిరింది.
దుబాయ్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో లులూ గ్రూప్ చైర్మన్, ఎండీ యుసుఫ్ అలీ భేటీ అనంతరం పెట్టుబడికి సంబంధించిన ఈ ప్రకటన వెలువడిరది. త్వరలో జరగబోతున్న వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ (వీజీజీఎస్) ప్రమోషన్ రీత్యా సీఎం భూపేంద పటేల్ అధికారిక పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలోకి విదేశీ ప్రత్యక పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఎంవోయూ ప్రకారం గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్‌ల మధ్య లులూ గ్రూప్ షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేయనుంది.