Namaste NRI

శాకిని -డాకిని.. ఫస్ట్ లుక్ రిలీజ్

రెజీనా, నివేదా థామస్‌  ప్రధాన పాత్రల్లో సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం శాకిని డాకిని.  రెజీనా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రెజీనా, నివేదా మిలటరీ దుస్తుల్లో కనిపించారు. వారి హావభావాల్ని బట్టి ఎదో తప్పు చేసి దొరికిపోయినట్లు అర్థమవుతోంది. ఈ ఇద్దరి పాత్రలు చాలా పవర్‌ ఫుల్‌గా. ఉండబోతున్నాయని ఫస్ట్‌ లుక్‌తో చెప్పేశాడు సుధీర్‌ వర్మ. మిడ్‌నైట్‌ రన్నర్స్‌ సినిమా ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. ఇందులో నాయికలిద్దరూ యాక్ష్షన్‌ సీక్వెన్స్‌లు చేశారు. ఈ సినిమాకి మిక్కీ మెల్క్రెరీ స్వరాలందిస్తున్నారు. రిచర్డ్‌ ప్రసాద్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. కొరియన్‌ మూవీ మిడ్‌ నైట్‌ రన్నర్స్‌ ఆధారంగా  తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని  డి. సురేష్‌బాబు, సునీత తాటి, హ్యున్‌ వ్యూ థామస్‌ కిమ్‌ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో ఉంది.  నిర్మాణాంతర పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అని చిత్ర నిర్మాతలు తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events