Namaste NRI

8.81 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారు : కేంద్రం

గత ఏడేళ్లలో 8.81 లక్షల పైచిలుకు భారతీయులు తమ పౌరసత్వం వదులుకుని విదేశాలకు తరలిపోయారని కేంద్రం పేర్కొంది. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ మేరకు ప్రకటించింది. విదేశాంగ శాఖ తాజా లెక్కల ప్రకారం గత ఏడేళ్లలో 8,81,254 మంది  తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు.  కాగా ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో లక్ష మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్రం గత నెలలోనే ప్రకటించింది. ఇలా విదేశాలకు శాశ్వతంగా తరలిపోతున్న వారిలో అధిక శాతం మంది అపరకుబేరులేనని తెలుస్తోంది.  అయితే ఈ వలసలకు కారణమేంటనేది మాత్రం ప్రభుత్వం వెల్లడిరచలేదు.

                ప్రస్తుతం, మోర్గాన్‌ స్టాన్లీ యొక్క ఎక్సోడస్‌ ఇన్‌ ది వరల్డ్‌ జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. 2014`2020 మధ్య కాలంలో దాదాపు 35,000 మంది అధిక నికర విలువ కలిగిన భారతీయ పారిశ్రామికవేత్తలు మిగిలిపోయారు. గ్లోబల్‌ వెల్త్‌ మైగ్రేషన్‌ రివ్యూ నివేదికను విశ్వసిస్తే, చైనా తర్వాత అత్యధిక నికర విలువ కలిగిన వ్యక్తులు దేశం విడిచిపెట్టిన వాటిలో ప్రపంచంలో రెండవ దేశం భారతదేశం. వ్యక్తులకు పెట్టుబడి కార్యక్రమం ద్వారా పౌరసత్వం అందించే దేశాలు ప్రపంచంలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events