ఏ ఎన్నిక వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని టీఆర్‌ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగారాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పార్టీ అన్నారు. స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలిలోని 12 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నూటికి నూరు శాతం టీఆర్‌ఎస్ గెల్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీలుగా ఘన విజయం సాధించిన భాను ప్రసాదరావు, రమణ, విఠల్, యాదవరెడ్డి, కోటిరెడ్డి, మధులకు సౌత్ ఆఫ్రికా శాఖ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)