కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్లో రాబోతున్న బంగార్రాజు సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో ఓ ప్రత్యేక గీతంలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటించింది. అనూప్ రూబెన్స్ సంగీతం సారథ్యంలో ఇది వరకు విడుదల చేసిన లడ్డుండా నా కోసం పాటలకు మంచి స్పందన లభించింది. త్వరలోనే మూడవపాట రాబోతోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 17న సాంగ్ టీజర్ విడుదల చేస్తున్నారు. మొదటిసారిగా మ్యూజిక్ కాన్సెస్ట్ పోస్టర్ విడుదల చేశారు. కళ్యాణ్ కృష్ణ కురుసాల దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. అందులో నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు స్రీక్వెల్గా రాబోతోన్న ఈ బంగార్రాజు చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.వి., జీ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.