అమెరికాలో కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 8 లక్షలు దాటింది. కరోనా వల్ల అత్యధిక స్థాయిలో మరణాలు సంభవించింది అమెరికాలోనే. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆ దేశంలో 50 మిలియన్లకు చేరుకున్నది. వ్యాక్సిన్ వేసుకోనివారిలో వృద్ధులో ఎక్కువ శాతం మరణాలు నమోదు అయినట్లు తెలుస్తోంది. గత ఏడాది కన్నా ఈ ఏడాదే ఎక్కు మంది అమెరికన్లు మృతి చెందినట్లు డేటా చెబుతోంది. ఇంకా ఇప్పటికి కూడా ఆ దేశంలో కరోనా మరణాలు రేటు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన 11 వారాల్లోనే లక్ష మందికి పైగా కరోనా వల్ల ప్రాణాలను కోల్పోయారు. ఇది గత ఏడాది వింటర్ సీజన్‌తో పోలిస్తే ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. 650 రోజుల క్రితం అమెరికాలో తొలి కొవిడ్ మరణం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. రెండవ ప్రపంచ యుద్ధంతో పోలిస్తే అమెరికాలో కరోనా మరణాలు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు.