సీం కేసీఆర్ ఆదేశాలకు మేరకు యాదాద్రి ఆలయ పున ప్రారంభ పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహాద్బుత ఆధ్యాత్మిక దివ్య క్షేత్రంగా రూపు దిద్దుకున్న యాదాద్రి ఆలయ పున ప్రారంభ తేదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆలయ పనుల పురోగతి, మహా సుదర్శన యాగం, మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు దేశాలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఎన్‌ఆర్‌ఐల విరాళాలను స్వీకరించడానికి దేవాదాయ శాఖ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ యాప్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ ఐటీ శాఖ రూపొందించిన టీ యూప్ ఫోలియో మొబైల్ యాప్‌లోని నాన్‌రెసిడెంట్ ఇండియన్ అనే ప్రత్యేక ఆప్సన్ ద్వారా ప్రవాస భారతీయులు ఆలయాలకు విరాళాలు ఇవ్వవచ్చు. ప్రస్తుతం యాదాద్రితో పాటు హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ, పెద్దమ్మ ఆలయాలు, సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయం, కర్మన్‌ఘాట్‌లోని ఆంజనేయస్వామి ఆలయాలను మాత్రమే ఇందులో పొందుపరిచామని, త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాను చేరుస్తామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కు మార్, అధికారులు కె.జ్యోతి, డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, యాదాద్రి, వేములవాడ, బాసర ఆలయాల ఈవోలు గీతారెడ్డి కృష్ణప్రసాద్, వినోద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. …….