తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. గాంధీభవన్‌లో ఆయన ఉత్తమ్‌కుమార్ నుంచి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతల కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి, దామోదర రాజనర్సింహా, సీతక్క, సీనియర్ నేతలు నాగం జనార్దన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య సహా కొత్త కార్యవర్గ సభ్యులు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు. పీసీసీ బాధ్యతలకు సంబంధించిన పత్రాలపై ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రేవంత్‌రెడ్డి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కాంగ్రెస్‌కు పునర్వైభవం తేవాలని ఆకాంక్షించారు. అంతకుముందు రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడికి చేరుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. తర్వాత అక్కడి నుంచి రేవంత్ ర్యాలీగా గాంధీభవన్‌కు చేరుకున్నారు.