ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎంకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థకు చెందిన ముగ్గురు సీనియర్ ఉద్యోగులు బయటికి వెళ్లిపోయారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిషేక్ అరుణ్, ఆఫ్ లైన్ పేమెంట్స్ సీవోవో రేణు సాతి, సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ అభిషేక్ గుప్తా రాజీనామాలు చేశారు. అభిషేక్ అరుణ్ ఐదేళ్లకు పైగా పేటీఎంలో ఉన్నారు. అభిషేక్ గుప్తా, రేణు సాతి గత ఏడాదే పేటీఎంలో చేరారు. అయితే వీరు రాజీనామాలు చేసినట్టు పేటీఎం అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఏడాది ఆరంభంలో ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు సంస్థ నుంచి బయటకు వెళ్లారు. ఇటీవల పేటీఎం ఐపీఓకు వెళ్లింది. అయితే ఈ ఐపీఓ ఆదిలోనే నిరాశపరిచింది. ఈ తరుణంలో ముగ్గురు టాప్ లెవెల్ అధికారులు బయటకు వెళ్లడం కంపెనీకి పెద్ద దెబ్బగానే భావించవచ్చు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)