ఆస్ట్రేలియా న్యూసౌత్‌వేల్స్‌లోని బ్లాక్‌టౌన్ నగర మండలిలో కౌన్సిలర్‌గా హైదరాబాద్‌కు చెందిన చెట్టిపల్లి లివింగ్‌స్టన్ ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ముషీరాబాద్ గోల్కొండ క్రాస్‌రోడ్స్‌లోని ఎంబీ హైస్కూల్ మాజీ ప్రిన్సిపల్ డేవిడ్, రాజకుమారి దంపతుల కుమారుడైన లివింగ్‌స్టన్ ఉస్మానియాలోని పీజీ చేసి అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్కడ సిడ్నీ సాంకేతిక విశ్వవిద్యాలయంలో మేనేజ్‌మెంట్ మాస్టర్ డిగ్రీ పొందారు. ప్రస్తుతం న్యూసౌత్‌వేల్స్‌లోని కమ్యూనిటీ, జస్టిస్ శాఖలో సీనియర్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రవాస భారతీయులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన తెలుగు కుటుంబల వారు ఆయన్ను అభినందించారు.