Namaste NRI

చైనా ప్రభుత్వం అత్యంత సంచలన నిర్ణయం

భారత్‌తో చైనాకున్న సరిహద్దు సమస్యల నేపథ్యంలో చైనా ప్రభుత్వం అత్యంత సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ భవష్యత్‌ అవసరాలు, భారత్‌తో ఉన్న సరిహద్దు సమస్యల దృష్ట్యా టిబెట్‌ పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా శిబిరాలు, మిలటరీ శిక్షణ కూడా ఇప్పించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రత్యేక శిబిరాల్లో ఉన్న పిల్లలంతా ఎనిమిది, తొమ్మిది సంవత్సరాల వయస్సున్న పిల్లలే కావడం సంచలనం. భారత్‌తో  ఉన్న సరిహద్దు సమస్యలు, ప్రపంచ రాజకీయాలు, చైనా ముందున్న సవాళ్లు వీటన్నింటిపై ఆ పిల్లలకు ప్రత్యేకంగా బోధిస్తారు. అంతేకాకుండా ఆ పిల్లలందర్నీ వారి తల్లిదండ్రులకు దూరంగా ఉంచుతూ, వారి కోసం ప్రత్యేకమైన హాస్టల్స్‌ కూడా ఏర్పాటు చేశారని, టిబెట్‌ సంస్కృతికి, సంప్రదాయాలకు ఆ పిల్లల్ని దూరంగా ఉంచుతున్నారని తేలింది. ఈ టిబెట్‌ పిల్లలందర్నీ చైనా కమ్యూనిస్టు పార్టీకి, చైనాకు వీర విధేయులుగా తీర్చి దిద్దడమన్న ఏకైక లక్ష్యంగా ఈ ట్రైనింగ్‌ సెంటర్లు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events