రష్యాలో మరోసారి గూగుల్‌కు భారీ షాక్ తగిలింది. నిషేధిత కంటెంట్‌ని తొలగించడంలో విఫలమైనందున రష్యా కోర్టు భారీ జరిమానా విధించింది. స్థానికంగా నిషేధం విధించిన సమాచారాన్ని తొలగించడంలో పదేపదే నిర్లక్ష్యం వహించినందుకు గానూ ట్యాగన్స్కీ జిల్లా న్యాయస్థానం దాదాపు 7.2 బిలియన్ రూబెల్స్ (98.4 మిలియన్ డాలర్లు) జరిమానా వేసింది. అయితే దీనిపై టెక్ దిగ్గజం గూగుల్ స్పందించింది.కోర్టు డాక్యుమెంట్‌ని అధ్యయనం చేసిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడిరచింది.