కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగింది. ప్రభావం తగ్గుతుందన్న అంచనాల మధ్య చాలా మంది కుటుంబాలతో కలిసి క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు హాలీడే ట్రిప్‌లకు ప్లాన్ చేసుకున్నారు. భారత్‌లో దేశీయంగా అంతర్జాతీయంగా అత్యంత ప్రమాదకర ఒమిక్రాన్ వేరియంట్ వల్ల హాలీడే ప్రయాణాలకు గట్టి షాక్ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియెంట్ ప్రభావం విమాన సర్వీసులపై పడిరది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులతో 4,500 విమాన సర్వీసులను రద్దు చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ క్రిస్మస్ ఆనందాన్ని తగ్గించింది. ఒమిక్రాన్ వల్ల క్రిస్మస్ ఆనందాన్ని తగ్గించడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వేలాది విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. కమర్షియల్ ఎయిర్‌లైన్ క్యారియర్లు క్రిస్మస్ వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా 4,500 విమాన సర్వీసులను రద్దు చేశాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కారణంగా పండుగ సంతోషాన్ని ప్రయాణ ప్రణాళికలను దెబ్బతీశాయి.
ఒక్క క్రిస్మస్ రోజే 2000 సర్వీసులు రద్దయ్యాయని ఫ్లైట్ అవేర్ డాట్ కాం తెలిపింది. వీటిలో అమెరికాలోని వివిధ విమానాశ్రయాలకు వెళ్లాల్సిన 700 విమాన సర్వీసులున్నాయి. 1500కి పైగా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. శుక్రవారం 2400 సర్వీసులు రద్దయ్యాయి. 11 వేల విమాన సర్వీసులు ఆలస్యంగా బయలుదేరాయి. ఇక ఆదివారం 600 కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.