రాజకీయ నాయకులను, ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడమే తీన్మార్ మల్లన్న లక్ష్యం అని టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా ప్రెసిడెంట్ గుర్రాల నాగరాజు అన్నారు. రాజకీయంగా టీఆర్‌ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా లేక కేసీఆర్ కుటుంబంపై పిచ్చి రాతలు రాస్తున్న మల్లన్న బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంతో మందిని మల్లన్న బెదిరించారని అన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబాన్ని ఇష్టమెచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు, ఇలాంటి చిల్లర వ్యక్తిని పార్టీలో చేర్చుకునే ముందు ఆలోచించాలన్నారు. తీన్మార్ మల్లన్న బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)