సుగమ్య శంకర్, నందిని, రాఘవ, చరణ్ జడ్చర్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం యజ్ఞ. హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి టీఎఫ్‌సీసీ చైర్మన్ ఆర్.కె.గౌడ్ క్లాప్‌నివ్వగా, సాయివెంకట్ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ హారర్ కథాంశంతో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. యజ్ఞ ఎవరు? ఆ పేరు వెనుకున్న రహస్యమేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. తదుపరి షెడ్యూల్‌ను జనవరి ప్రథమార్థంలో మొదలుపెట్టనున్నాం అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ కొత్త రకమైన ఈ కథ నచ్చడంతోనే సినిమాని ఆరంభించాం అన్నారు. అనంతరం ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ అభిరుచికలిగిన దర్శక నిర్మాతలు కలిసి చేస్తున్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. నటనకు ఆస్కారమున్న పాత్రల్ని పోషించే అవకాశం రావడం ఆనందంగా ఉందని హీరో హీరోయిన్లు తెలిపారు. భానుచందర్, జీవా, గౌతంరాజు, సుమన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : దేవేందర్, కెమెరా శ్రావణ్‌కుమార్. చిత్తజల్లు ప్రసాద్ దర్శకుడు. పొందూరి రామ్మోహన్రావు నిర్మిస్తున్నార. ఈ కార్యక్రమంలో గూడూరు చెన్నారెడ్డి, విజయలక్ష్మి, మారంరెడ్డి కొండారెడ్డి, కొండపాక శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.