కరోనా పలు వేరియంట్లు సహా తాజా ఒమిక్రాన్ ఉద్ధృతితో అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. 24 గంటల వ్యవధిలో 4,41,278 కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు అంటువ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) వెల్లడిరచింది. అయితే ఇందులో సగానికి పైగా ఒమిక్రాన్ కేసులే ఉండటం కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ముప్పు అధికంగానే ఉందని అభిప్రాయపడిరది. బ్రిటన్, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు సంబంధించి సమాచారం పరిశీలిస్తే.. హాస్పటళ్లలో చేరే ముప్పు తక్కువగానే ఉంటుందని సీడీసీ అభిప్రాయపడిరది. కాలిఫోర్నియాలో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ అక్కడ నమోదైన కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది. దీంతో ఇంత భారీ మొత్తంలో కేసులు నమోదైన తొలి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. ఈ ఒక్క రాష్ట్రంలోనే ఇప్పటి వరకు దాదాపు 75 వేల మందికి పైగా మరణించారు.