నటి అమలాపాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది. పదేళ్ల కాలపరిమితితో అమలాపాల్‌కు యూఏఈ ఈ లాంగ్‌టర్మ్ రెసిడెన్సీ వీసాను జారీ చేసింది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. వారు బంగారం కోసం వెళ్ళు అని అంటున్నారు. నేను బంగారం కోసం వెళ్ళాను. యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నాను. కచ్చితంగా ఇది అద్భుతమైన అనుభూతి. ఇది జరిగేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఆమె తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. వీసా అందుకున్న ఫొటోను ఈ ఇన్‌స్టా పోస్టుకు ఆమె జత చేశారు. సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు అని చెప్పవచ్చు. ఇటీవల ఈమె హవా కాస్త తగ్గింది. అయితే వెబ్ సిరీస్‌లతో బిజీగానే ఉన్నారు.