మిస్టర్ అండ్ మిస్ సినిమా రూపొందించిన దర్శకుడు అశోక్ కుమార్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా మహానటులు. అభినవ్ మణికంఠ, గోల్డీనిస్సీ, మ్యాడీ విజే, పవన్మ్రేష్, భరత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మహానటులు. అనిల్ బొడ్డిరెడ్డి, తిరుపతి యర్రంరెడ్డి నిర్మాతలు. మహానటులు పోస్టర్, ఆవిష్కరణ, పాత్రల పరిచయ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ జాతిరత్నాలు జోనర్‌లో సాగే చిత్రమిది. ఆద్యంతం వినోదంతో అలరిస్తుంది. ఓ నలుగురు యువకులు కలిసి మహానటులు అనే యూట్యూబ్ ఛానెల్‌ను ఎలా తయారు చేశారన్నదే చిత్ర కథ అన్నారు. నూతన ప్రతిభను పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ బ్యానర్‌గా ప్రారంభించామని నిర్మాతలు తెలిపారు. సినిమాలో నాలుగు పాటలుంటాయని సంగీత దర్శకుడు మార్కస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, బిగ్ బాగ్ విజేత సన్నీ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.ఈ చిత్రానికి కెమెరా: సిద్ధం నరేష్, కథ, మాటలు: పి.సుధీర్ శర్మ.