రవితేజ హీరోగా నటించనున్న రావణాసుర ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది. సంక్రాంతి పండగ సందర్భంగా రావణాసుర సినిమా ప్రారంభోత్సవం జనవరి 14న హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరగనుంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ పతాకాలపై అభిషేక్ నామా నిర్మించనున్నారు. ఇందులో రవితేజ పది గెటప్స్‌లో కనిపిస్తారు అని చిత్ర బృందం పేర్కొంది. ఇందులో రవితేజ న్యాయవాదిగా కనిపించనున్నారు. ఆయన పాత్ర చాలా విలక్షణంగా ఉండనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటిస్తాం అని చిత్రబృందం తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)