ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కువైత్ ప్రభుత్వం ఆ దేశ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే యూకేకు వెళ్లిన వాళ్లు కూడా సాధ్యమైనంత త్వరగా బ్రిటన్‌ను వీడాలని యూకేలో కువైత్ ఎంబసీ తెలిపింది. ప్రజలెవరూ యూకేకు వెళ్లొద్దని సూచించింది. గడిచిన 24 గంటల్లో యూకేలో 1.37 లక్షల కొవిడ్ కేసులు నమోదైనట్టు తెలిసింది. 50 సంవత్సరాలు దాటిని వారి కోసం బూస్టర్ డోస్ నిబంధనలను కువైత్ ప్రభుత్వం సడలించింది. ఎటువంటి ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకోవచ్చని తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)