Namaste NRI

సార్క్‌ సదస్సు ..ఆహ్వానం అందలేదన్న భారత్‌!

దక్షిణాసియా దేశాల కూటమి (సార్క్‌) సదస్సుకు హాజరు కావాలని భారత్‌ను ఆహ్వానించినట్లు పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ తెలిపారు. అయితే సార్క్‌ సదస్సుకు హాజరు కావాలని తమకు అధికారికంగా ఎటువంటి ఆహ్వానం అందలేదని భారత్‌ తెలిపింది. సార్క్‌ కూటమిలో భారత్‌తోపాటు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, భూటాన్‌, మాల్దీవులు, నేపాల్‌ సభ్య దేశాలు. సార్క్‌ అంటే దక్షిణాసియా ప్రాంతీయ  సహకారం సంఘం. 2014లో నేపాల్‌ రాజధాని ఖాట్మండులో సదస్సు తర్వాత సార్క్‌ సభ్యదేశాలు మళ్లీ సమావేశం కాలేదు. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్‌ నిర్వహించే సదస్సుకు హాజరు కాలేమని పేర్కొన్నది. భారత్‌ తర్వాత పాక్‌లో సదస్సుకు హాజరు కావడానికి బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఆప్ఘనిస్థాన్‌ నిరాకరించాయి. గతవారం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సార్క్‌  సదస్సు నిర్వహణపై స్పందించారు. ఈ సదస్సు నిర్వహణకు నెలకొన్న కృత్రిమ అడ్డంకుల తొలగింపునకు మార్గంగా చాలా కాలంగా జాప్యమైన సార్క్‌ సమ్మిట్‌ నిర్వహించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events