ధనుష్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాష చిత్రం సార్. తమిళంలో వాతి గా విడుదల కానుంది. ఈ సినిమాని హైదరాబాద్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి పారిశ్రామికవేత్త సురేష్ చుక్కపల్లి, నిర్మాత కేఎల్ నారాయణ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ఎస్. రాధాకృష్ణ స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందించాడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, లక్ష్మీ సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేరళ బ్యూటీ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. యాన్ యూంబిషియస్ జర్నీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్ అనేది ఈ సినిమా స్లోగన్. జనవరి 5న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం అని చిత్రబృందం వెల్లడిరచింది. ఈ సినిమాలో లెక్చరర్ పాత్రలో కనిపిస్తారు ధనుష్. అంటే సార్ క్లాసులు ప్రారంభం అన్నమాట. విద్యావ్యవస్థ చుట్టూ అల్లుకున్న ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. సాయికుమార్, తనికెళ్ల భరణి, నర్రా శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్, సినిమాటోగ్రాఫర్ : దినేష్ కృష్ణన్. కూర్పు: నవీన్ నూలి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)