ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కు మరోసారి చుక్కెదురైంది. ఒక విజయం కోసం తపిస్తున్న టైటాన్స్‌కు మరోసారి ఓటమిపాలైంది. పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30`31 తో పరాజయం పాలైంది. తెలుగు టైటాన్స్ తరపున అంకిత్ బెనివాల్ 10 పాయింట్లు స్కోరు చేశాడు. మోను గోయల్ (7), సచిన్ (6), ప్రశాంత్ (5) రాణించి పట్నా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడిరట ఓడి, రెండిరటిని డ్రా చేసుకున్న టైటాన్స్ 9 పాయింట్లతో పట్టికలో 11వ స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 32`28తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడిరచింది. వారియర్స్ స్టార్ ప్లేయర్ మణీందర్ సింగ్ 13 పాయింట్లు స్కోరు చేయడంతో పాటు పీకేఎల్ చరిత్రలో 800 రెయిడిరగ్ పాయింట్ల మైలురాయిని చేరుకోవడం విశేషం.