మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆచార్య. ఈ చిత్రంలోని సానా కష్టం అనే స్పెపల్ సాంగ్‌లో చిరంజీవితో కలిసి రెజీనా స్టెప్పు లేశారు. ఈ పాట పూర్తి లిరికల్ వీడియో విడుదలైంది. కల్లోలం కల్లోలం ఊరూ వాడా కల్లోలం.. నేనొస్తే అల్లకల్లోలం అంటూ మొదలై.. సానా కష్టం సానా కష్టం వచ్చిందే మందాకిని అంటూ సాగే ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. రేవంత్, గీతా మాధురి పాడారు. ఈ సినిమాకు మణిశర్మ స్వరకర్త. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, రామ్‌చరణ్, పూజా హెగ్దే కీలక పాత్రలు చేశారు. దేవాదాయ శాఖలోని అవినీతి నేపథ్యం చుట్టు అల్లుకున్న కథతో ఈ చిత్రం రూపొందినట్లు సమాచారం. ఈ సినిమా కోసం ధర్మస్థలి అనే ఓ భారీ ఊరి సెట్‌ను వేశారు. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న రిలీజ్ కానుంది. హుషారైన బీట్‌తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే గీతమిదని, విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటున్నదని చిత్రబృందం తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)