అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, కుమార్తె ఇవాంకా ట్రంప్‌లకు న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటీషియా జేమ్స్ ఇటీవల సమన్లు జారీ చేసింది. డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్ కంపెనీ నియంత్రణ లోని ఆస్తుల మదింపు, వారి వ్యాపార కార్యకలాపాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. దీనికి సంబంధించే వాంగ్మూలం ఇచ్చేందుకు రావాల్సిందిగా మగ్గురికి సమన్లు జారీ అయ్యాయి. ఈ కేసులో దర్యాప్తు తన హక్కులకు భంగం కలిగిస్తోందంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఫెడరల్ కోర్టులో దావా వేశారు.