Namaste NRI

అమెరికాలో కరోనా విలయం.. ఒక్కరోజేలోనే

అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గత వేవ్‌ల కంటే అమెరికాలో మూడు రెట్లు అధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. రోజువారీ కరోనా కేసలు రికార్డు స్థాయిలో నమోదు అవుతుండగా, నిన్న ఒక్కరోజే  10 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ రెండేండ్ల కాలంలో ఒకే రోజు ఇన్ని కేసులు  ఏ దేశంలో కూడా నమోదు కాలేదు.  అమెరికాలో గత నాలుగు రోజుల క్రితం 5,90,000 కేసులు నమోదు కాగా, నిన్నటికి ఆ సంఖ్య రెట్టింపు అయింది. కరోనా ఉధృతి నేపథ్యంలో అమెరికాలో స్కూళ్లు, కార్యాలయాలను మూసివేశారు. విమానాలను రద్దు చేశారు. కేసుల తీవ్రతతో ఆస్పత్రులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.

                        అమెరికాలో ఇప్పటి వరకు 55 మిలియన్లకు పైగా కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.  ప్రతి ఆరుగురిలో ఒకరు కరోనా బారిన పడ్డారు. కరోనాతో 8,26,000 మంది చనిపోయినట్లు జాన్స్‌ హాఫ్‌కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడిరచింది.  కొత్త కేసులు పెరుగుతుండటంతో అమెరికాలో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి.  ప్రస్తుతం లక్షకు పైగా కొవిడ్‌ బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐసీయూలో ఉన్నవారి సంఖ్య 18 వేలకు పైనే ఉందని అధికారులు తెలిపారు. 2021 జనవరిలో అత్యధికంగా 1.42  లక్షల మంది ఆసుపత్రి పాలవ్వగా ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో ఆసుపత్రుల్లో చేరికలు ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events