సంక్రాంతికి రావల్సిన రాధేశ్యామ్ కూడా వాయిదా పడిరది. ఒమిక్రాన్ వైరస్ తీవ్రత కారణంగా సినిమాని వాయిదా వేస్తున్నట్టు నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ వెల్లడిరచింది. ఈ నెల 14న విడుదల కావాల్సిన సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడిరచింది. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు గత కొన్ని రోజులుగా మేము ప్రయత్నిస్తున్నాం. కానీ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చిత్రాన్ని వాయిదావేస్తున్నాం. ప్రేమకు, విధికి మధ్య జరిగే కథ ఇది. మీరు మాపై చూపించే ప్రేమ కలిసికట్టుగా ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించేలా చేస్తుందని నమ్ముతున్నాం. పరిస్థితులు చక్కబడిన వెంటనే సినిమా విడుదల చేస్తాం అని నిర్మాత సంస్థ పేర్కొన్నది. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. పూజా హెగ్డే కథానాయిక. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మాతలు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : మనోజ్ పరమాహంస. భీమ్లానాయక్, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, ఇప్పుడు రాధేశ్యామ్ ఇలా ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన అగ్ర తారల సినిమాలన్నీ వరుసగా వాయిదా పడినట్లైంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)