కరోనా మహమ్మారి మళ్లీ తన ప్రతాపాన్ని చూపేందుకు సిద్ధంగా ఉంది. దేశంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు ఎంత ప్రయత్నించినా కేసులు మాత్రం రోజురోజకి పెరుగుతూనే ఉన్నాయి. భారత్‌లో థర్డ్ వేవ్ ప్రారంభమైనట్లు ఆరోగ్య స్పష్టం చేసింది. అయితే పంజాబ్‌లోని అమృత్‌సర్ విమానాశ్రయంలోకి వచ్చిన చార్టర్డ్ విమానంలో కరోనా కలకలం రేగింది. ఇటలీ నుంచి అమృత్సర్‌కు చార్టర్డ్ ఫ్లైట్‌లో వచ్చిన ప్రయాణికులకు పరీక్షల జరుపగా అందులో 125 మందికి కరోనా నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపారు. విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు ఉన్నారు. పాజిటివ్‌గా తేలిన ప్రయాణికులను ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌కు పంపిస్తామని రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు.