ఆస్ట్రేలియాలో హైదరాబాద్కు చెందిన యువకుడు అదృశ్యమయ్యాడు. మహ్మద్ మోసిన్ అలి మాజ్(28)అనే యువకుడు మాస్టర్స్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ మెల్బోర్న్ దగ్గర ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే 2021 డిసెంబరు 30 నుంచి కుటుంబంతో అతని సంబంధాలు తెగిపోయాయి. చివరి సారిగా క్లేటన్ సౌత్ దగ్గర ఉన్నట్టుగా తెలిసింది. మహ్మద్ మోసిన్ అలిమాజ్ ఆచూకీ తెలియక పోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. యువకుడి అదృశ్యంపై ఆస్ట్రేలియాలో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు విక్టోరియా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే బాధితుడి సోదరుడు సోషల్ మీడియా ద్వారా తన సోదరుడి అదృశ్యం గురించిన వివరాలు వెల్లడిరచారు. ఆచూకి తెలిస్తే చెప్పాల్సిందిగా కోరాడు.