Namaste NRI

భారతీయులకు గుడ్ న్యూస్.. త్వరలో ఈ-పాస్ పోర్టు

త్వరలో ఈ`పాస్‌పోర్టులు జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్‌ భట్టాచార్య ఈ విషయాన్ని వెల్లడిరచారు. ఈ పాస్‌పోర్టుల్లో బయోమెట్రిక్‌ ఆధారిత అత్యాధునిక భద్రతా వ్యవస్థ ఉంటుందని తెలిపారు. వీటి ద్వారా విదేశీ ప్రయాణాలు మరింత సులభంగా మారుతాయని తెలిపారు. ఈ పాస్‌పోర్టులో ప్రత్యేక మైక్రోచిప్‌లు ఉంటాయి. పాస్‌పోర్టు దారుడికి సంబంధించి బయోమెట్రిక్‌ డాటా వంటి కీలక వివరాలన్నీ ఈ చిప్‌లో ఉంటాయి. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ కారణంగా ఈ పాస్ట్‌పోర్టులను ఫోర్జరీ చేయడం లేదా నకళ్లు సృష్టించడం మరింత కష్టతరం కానుంది. కేంద్రం ఇప్పటికే 20 వేలకు పైగా అధికారిక, దౌత్య పాస్‌పోర్టులను ప్రయోగాత్మకంగా జారీ చేసింది. ఈ ట్రయల్‌ సత్ఫలితాలను ఇస్తే సామాన్యులకు కూడా వీటిని జారీ చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events