శ్రుతీహాసన్ లిస్ట్‌లో మరో భారీ ఆఫర్ చేరనుందా? అంటే ఫిల్మ్‌నగర్ అవుననే అంటోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన నటి శ్రుతిహాసన్ నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం చిరు హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొంతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి మత్స్యకారుడిగా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం చిత్ర బృందం శ్రుతిని సంప్రదించినట్లు తెలిసింది. చిత్రకథ, ఆమె పాత్ర నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు శ్రుతిహాసన్ అంగీకరించినట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం కోసం వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)