చిత్రపరిశ్రమను కరోనా కలవరపెడుతోంది. బాహుబలి లో కట్టప్పగా నటించి అలరించిన సీరియర్ నటుడు సత్యరాజ్ కూడా కరోనా బారినపడ్డారు. ఆయనకు ఇతర అనారోగ్య సమస్యలు ఉండటంతో పాటు వయసు కాస్త ఎక్కువ కావడం వల్ల వెంటనే ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి సత్యరాజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు. సత్యరాజ్ ఒక సినిమా షూటింగ్లో పాల్గొన్న సమయంలో కోవిడ్ బారిన పడ్డట్లుగా తెలిసింది. ఇప్పుడు ఆ సినిమా యూనిట్ సభ్యులు అంతా కూడా హోమ్ క్వారైంటెన్లో ఉన్నారని సమాచారం.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)