ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫిన్‌టెక్ సంస్థ గ్రోవ్‌లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తున్నది. ఇన్వెస్టర్‌తో పాటు కంపెనీ సలహాదారుడిగా కూడా ఆయన పని చేయనున్నారు. ఈ విషయాన్ని గ్రోవ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో లలిత్ కేశ్రే వెల్లడిరచారు.
ప్రపంచంలో అత్యుత్తమ సీఈవోలలో ఒకరు గ్రో కు ఇన్వెస్టర్‌గా, అడ్వైజర్‌గా వ్యవహరించనున్నారు. భారత్‌లో ఆర్థిక సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న మా ఆశయంలో సత్య నాదెళ్ల కూడా చేరడం సంతోషంగా ఉంది అని లలిత్ తెలిపారు. 2021లోను గ్రో రెండు నిధులను సేకరించింది. ఏప్రిల్‌లో 83 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రావడంతో సంస్థ విలువ ఒక బిలియన్ డాలర్లకు చేరింది. అక్టోబర్‌లో మరో 251 బిలియన్ డాలర్లు సమీకరించడంతో కంపెనీ విలువ ఏకంగా మూడు బిలియన్ డాలర్లకు చేరింది.