Namaste NRI

ట్రైలర్ చూస్తే.. ప్రేమదేశం గుర్తుకొచ్చింది : ఎన్టీఆర్

దిల్‌రాజు ప్రొడక్షన్స్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించిన చిత్రం రౌడీ బాయ్స్‌. శిరీష్‌ తనయుడు అశిష్‌ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఈనెల 14న విడుదల చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ఈ సినిమా ట్రైలర్‌ను స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ రౌడీబాయ్స్‌ చిత్రం మంచి సినిమాగా మనకు గుర్తుండి పోవాలని కోరుకుంటున్నాను. ట్రైలర్‌ చూస్తే ప్రేమదేశం సినిమా చూసినట్లు అనిపించింది. నాకే కాదు ప్రేక్షకులందరికీ అలాగే అనిపిస్తుంది. హీరో ఆశిష్‌ మరిన్ని మంచి చిత్రాల్లో భాగం కావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అని అన్నారు. నిర్మాతలు దిల్‌ రాజు, శిరీష్‌ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాము. యువతరంతో పాటు కుటుంబ వర్గాలను మెప్పించే అన్ని హంగులున్న చిత్రమిది. కాలేజీ బ్యాక్‌ డ్రాప్‌లో చక్కటి ఎంటర్‌టైనర్‌గా సాగుతుంది. ఇప్పటి వరకు విడుదలై పాటలు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో హర్షిత్‌ రెడ్డి, దర్శక నిర్మాతలు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events