తెలుగు సినీ ఇండస్ట్రీని కరోనా మమహ్మారి వదలడం లేదు. ప్రముఖ నటీనటులు కూడా కరోనా బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ప్రముఖ నటడు, నటికిరీటి రాజేంద్ర ప్రసాద్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప కొవిడ్ లక్షణాలతో రాజేంద్ర ప్రసాద్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏఐజీ ఆస్పుత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని ఎవ్యరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. కాగా రాజేందప్రసాద్‌కు కరోనా సోకడంతో ఎఫ్ 3 సినిమా షూటింగ్ నిలిచిపోయింది.