అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ నగరం ఓ చరిత్రాత్మక చట్టం రూపొందింది. అమెరికా పౌరులు కాని వారు కూడా న్యూయార్క్ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయొచ్చు. నగర మేయర్, సిటీ కౌన్సిల్‌ను ఎన్నుకోవచ్చు. పౌరసత్వం లేకపోయినా చట్టబద్ధంగా నివసిస్తూ ఉంటే చాలు. నెల రోజుల క్రితం ఇందుకు సంబంధించిన బిల్లును న్యూయార్క్ సిటీ కౌన్సిల్ భారీ మెజారీటీతో ఆమోదించింది. అదిప్పుడు చట్టంగా మారింది. అయితే ఈ ఓటు హక్కు స్థానిక మున్సిపల్ ఎన్నికలకు మాత్రమే పరిమితి. అధ్యక్ష, రాష్ట్ర ఎన్నికలకు వర్తించదు. ఈ కొత్త చట్టంతో న్యూయార్క్ నగరంలో చట్టబద్ధంగా కనీసం 30 రోజుల నివసించే పౌరసత్వం లేని ఏ పౌరుడికైనా ఓటు హక్కు లభిస్తుంది. దాదాపు 8 లక్షల మంది పౌరసత్వం లేని పౌరులకు ఈ చట్టంతో లబ్ధి చేకూరనుంది.