అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ డైలీ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 60 మిలియన్లకి చేరుకుంది. జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు సుమారు 8 లక్షల మంది మృతి చెందారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం పేర్కొంది. కరోనా మహమ్మరితో అత్యధికంగా ప్రభావితమైన దేశంగా అమెరికా నిలిచింది. ఒక్కరోజే 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా, 308 మంది మృతి చెందారు. పైగా ప్రపంచపరంగా చూస్తే సుమారు 15 శాతానికి పైగా అత్యధిక మరణాలు యూఎస్‌లోనే సంభవించాయి. ఐతే గతేడాది నవంబర్ 29 కల్లా యూఎస్‌లో సుమారు 10 మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదైయ్యాయి. జవనరి 1, 2021 కల్లా 20 మిలియన్లు దాటింది. పైగా ఆ సంఖ్య గతేడాది డిసెంబర్ 13 చివరి కల్లా 50 మిలియన్లకు చేరింది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో డిసెంబర్ 1, 2021న కోవిడ్ 19 ఒమిక్రాన్ కొత్త వేరియంట్‌కి సంబంధించిన తొలి కేసు నమోదు అయ్యిందని మెడికల్ అడ్వైజర్ ఆంథోనీ ఫౌసీ తెలిపారు. ఈ కొత్త వేరియంట్ ఇప్పటి వరకు చాలా దేశాల్లో పెను విధ్వంసం సృష్టిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో అమెరికాలో రోజువారీ కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.