గుండె జబ్బుతో కచ్చితంగా గుండె మార్పిడి చేయాల్సి వచ్చిన అయనకు ఏ మనిషి గుండె కూడా సరిపడని పరిస్థితి. ఆ మాటే ఆయనకు చెబితే ఎలాగైనా సరే నన్ను బతికించి తీరాల్సిందే అన్నాడు. మరి అలాగైతే మీకు పంది గుండె పెట్టాల్సి వస్తుందని అని తేల్చాశాడు డాకర్టు. ఏ మాత్రం భయపడని ఆ వ్యక్తి ఆపరేషన్‌కు సరే అన్నారు. ఇదంతా అమెరికాలో జరిగింది. వైద్య రంగంలో మరో మైలురాయి నమోదైంది. మనిషికి పంది గుండెను అమర్చడంలో అమెరికా వైద్యులు విజయం సాధించారు. వైద్యచరిత్రలో ఇలా ఒక జంతువు గుండెను మనిషికి పెట్టడం ఇదే మొదటిసారి. డేవిడ్ బెనెట్ (57) అనే రోగిని కాపాడేందుకు చివరి ప్రయత్నంగా పంది గుండెను అమర్చినట్టు మేరిల్యాండ్ హాస్పిటల్ వైద్యులు వెల్లడిరచారు. ఈ ప్రయోగాత్మక శస్త్రచికిత్స తర్వాత రోగి కోలుకున్నాడని పేర్కొన్నారు.
ఈ ప్రయోగం సంపూర్ణంగా విజయం సాధించిందీ, లేదని అప్పుడే చెప్పలేమని తెలిపారు. అవయవ మార్పిడులు జరిపే ముందు ఒకరోజుపాటు తాత్కాలికంగా ఏదైనా జంతువు గుండెను అమర్చే విషయమై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ జంతు` మనిషి అవయవ మార్పిడులకు జన్యుపరమైన మార్పులు చేసిన జంతువుల శరీర భాగాలనే వినియోగిస్తున్నారు. తనకు మనిషి గుండెను అమర్చే అవకాశం లేదని, ఇక చావు తప్పదనుకున్న తరుణంలో వైద్యులు పంది గుండెను తనకు పెట్టారని రోగి బెనెట్ పేర్కొన్నారు.