ఆర్‌విజి మూవీస్‌తో కలిసి రెబెల్ నేసన్ పతాకంపై రవికిరణ్ నిర్మిస్తున్న ప్రేమకథ చిత్రం ఆరాధన. షూటింగ్ ప్రారంభమైంది. వశిష్ట పార్దసారథిని దర్శకుడిగా పరిచయం చేస్తూ పృధ్వీరాజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ రవికిరణ్ నిర్మాత పరిచయమవుతూ నిర్మిస్తున్నారు. ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రుద్రాభట్ల వేణుగోపాల్ ఈ చిత్రాన్ని మరో నిర్మాతణ. ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ సినిమా చూసిన ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా హృద్యమైన ప్రేమకథ గా అభివర్ణించేంతగా గొప్పగా ఆరాధన చిత్రాన్ని తెరెకికస్తున్నట్టు తెలిపారు. అధికభాగం షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని అద్భుతమైన లొకేషన్లలో జరుపుకోనుందని తెలిపారు. ఈ చిత్రానికి పాటలు: రెహమన్, సంగీతం: హరి గౌర, ఛాయాగ్రహణం: వేణు కొత్తకోట, నిర్మాతలు: రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) రచన, దర్శకత్వం: వశిష్ట పార్థసారధి.