Namaste NRI

మై నేమ్ ఈజ్ శృతి ఫస్ట్ లుక్, టీజర్ ను విడుదల చేసిన మంత్రి తలసాని

బబ్లీ బ్యూటీ హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మైనేమ్‌ ఈజ్‌ శృతి. ఈ చిత్రం టీజర్‌ను  హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ చిత్రం కచ్చితంగా సక్సెస్‌ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. క్రైమ్‌కు సంబంధించిన మెసేజ్‌ ఓరియెంటెడ్‌ వంటి మంచి కథను సెలెక్ట్‌ చేసుకుని ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మిత్రుడు బురుగు రమ్య ప్రభాకర్‌ గౌడ్‌, దర్శకుడు శ్రీనివాస్‌ ఓంకార్‌ ఈ కథను ఛాలెంజ్‌ని తీసుకుని చేస్తున్నారు. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ ఎంతో అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఫిల్మ్‌ఇండస్ట్రీ బలోపేతం కావటానికే టికెట్‌ రేట్స్‌ పెంచటం జరిగిందన్నారు. థియేటర్ల ఇబ్బందుల విషయంలో కూడా మాట్లాడతానని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో సినిమా ఇండస్ట్రీ దేశంలోనే ఒక హబ్‌గా ఉండాలనేది ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు.  ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ హన్సిక, చిత్ర దర్శకుడు శ్రీనివాస్‌ ఓంకార్‌, నిర్మాత ప్రభాకర్‌ గౌడ్‌ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రాన్ని డి. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్టవి ఆర్ట్స్‌ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events