నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవిందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతుండటంతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ డిసెంబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేశాం. అది సీజన్ కాదు. ఎవరు ముందు వస్తే వారి వెనుక వద్దామని అనుకున్నారు. అందరిలోనూ ఆ భయం ఉంది. మా నిర్మాత ధైర్యంతో రిలీజ్ చేశారు. తెలుగు ప్రేక్షకులు ఈ విజయాన్ని అందించారు. ధైర్యం చేసి రిలీజ్ చేసిన నిర్మాతకు నా అభినందనలు. ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అయింది. ఈ సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతోంది. పాకిస్థాన్‌లో సైతం మన అఖండ గురించి మాట్లాడుకుంటున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలి. చలనచిత్ర రంగం ఉన్నంత వరకు ఇలాంటి సినిమాలు నిలిచిపోతాయి. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి అని అన్నారు.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఇది డబుల్ సక్సెస్ మీట్. దీన్ని బ్లాక్ బస్టర్ హిట్. మాస్ జాతర అని అంటున్నారు. వాటన్నింటి కంటే ఇది ఎక్కువే. డబ్బు రావడం వేరు. ధైర్యం రావడం వేరు. ఈ చిత్రంలో అందరికీ దైర్యం వచ్చింది అఖండ కి కచ్చితంగా సీక్వెల్ ఉంటుంది అన్నారు. నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ అఖండలో నా గెటప్ చూసి ఇంట్లో వాళ్లూ భయపడ్డారు. మేకప్‌తో ఇంటికెళ్లే ఎవరో వచ్చారని వెళ్లిపోయేవారు. వరదరాజులుగా ఈ పాత్రకు ఇంత పేరు రావడానికి బోయపాటే కారణం అన్నారు. గత కొన్నేళ్లలో ఇలా డిసెంబర్లో విడుదలైన సంక్రాంతి వరకు కొన్ని వందల థియేటర్లలో నడుస్తున్నది అఖండ మాత్రమే. బయట ప్రపంచం ఎలా ఉన్నా సినిమాని తెలుగు ప్రేక్షకులు బతికిస్తార న్నారు నిర్మాతల రవీందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నటుడు అయ్యప్ప శర్మ, ఛాయాగ్రాహకుడు రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.