Namaste NRI

ఒమిక్రాన్ ఎఫెక్ట్…ఈ నిబంధన ప్రవాసులకు ఇబ్బంది

దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. దీంతో అగ్రరాజ్యం సహా ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. ఇండియాలో కూడా నిత్యం లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రయాణ మార్గదర్శకాలను సవరించిన ప్రభుత్వం.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 7 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సిందే అని స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధన ప్రవాసులకు ఇబ్బందిగా మారింది. మెడికల్‌ ఎమర్జెన్సీ, అత్యవసర పనుల నిమిత్తం ఇండియాకు వచ్చే వారి పరిస్థితి ఏంటని ప్రవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సాధ్యమైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events