Namaste NRI

నేటి నుంచి అండర్ -19 ప్రపంచ కప్

భవిష్యత్‌ క్రికెట్‌ స్టార్ల ప్రపంచ కప్‌ నేటి నుంచి మొదలవుతుంది. కరోనా కష్టకాలంలో పటిష్ట ఏర్పాట్ల మధ్య నేటి నుంచి ఐసీసీ మెగా టోర్నికి తెరలేవనుండగా.. మొత్తం 16 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇప్పటికే నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన భారత్‌, ఐర్లాండ్‌, దక్షిణాఫ్రికా, ఉగాండాతో కలిసి గ్రూప్‌`బిలో ఉంది. వెస్టిండీస్‌ ఆతిథ్యమిచ్చే ఈ అండర్‌` 19 వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌లో కరీబియన్‌ జట్టుతో ఆస్ట్రేలియా తలపడనుంది. రేపు గ్రూప్‌`బిలో తమ తొలి పోరులో యశ్‌ ధుల్‌ సారథ్యంలోని భారత అండర్‌ 19 జట్టు దక్షిణాఫ్రికాతో సమరానికి సిద్ధమైంది. మొత్తం 16 జట్లు నాలుగు గ్రూపుల్లో తలపడతాయి. అలాగే ఈ నెల 19న ఐర్లాండ్‌, 22న ఉగాండతో భారత్‌ ఆడనుంది. ట్రినిడాడ్‌, అంటిగ్వా, సెయింట్‌ కిట్స్‌, గయానా నగరాల్లోని మొత్తం 9 వేదికల్లో 23 రోజులపాటు ఈ యువ  మెగా టోర్నీ జరుగనుంది. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో సెమీఫైనల్స్‌, 5న జరిగే ఫైనల్స్‌తో ఈ ప్రపంచకప్‌ ముగుస్తుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events