యుఏఈ, దుబాయ్ నుంచి ముంబై వచ్చే ప్రయాణికులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఆ రెండు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇకపై ఆర్‌టీపీసీఆర్ టెస్టు ఉండదు. అలాగే ఏడు రోజుల తప్పనిసరి హోం క్వారంటైన్ నిబంధనను కూడా తొలగించారు. జనవరి 17 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని సంబంధిత అధికారులు వెల్లడిరచారు. ముంబై అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల యూఏఈ, దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో యూఏఈ నుంచి ముంబై వచ్చే ప్రయాణికులకు గతేడాది డిసెంబర్ 29 నుంచి ఎయిర్‌పోర్టుకు రాగానే ఆర్‌టీపీసీర్ టెస్టు, 7 రోజుల హోం క్వారంటైన్ నిబంధనను బీఎంసీ (బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు అమలు చేస్తున్నారు. తాజాగా ఈ నిబంధనను తొలగించారు.